బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకూ ఏపీలోని పలు జిల్లాలలో వర్షాలు కురవనున్నాయి. సోమవారం రాత్రి విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ఇచ్చింది. పిడుగులతో కూడిన వానలు పడేందుకు అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది.