పుష్ప 2 సినిమా సందర్భంగా.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్.. దాదాపు 5 నెలల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడటంతో డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. అయితే శ్రీతేజ్ ప్రస్తుతం తమను గుర్తు పట్టడం లేదని అతని తండ్రి వాపోయాడు. ఇక శ్రీతేజ్‌ను ఇంటికి కాకుండా రిహాబిలిటేషన్ సెంటర్‌కు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. అక్కడి నుంచి 15 రోజుల తర్వాత ఇంటికి తీసుకెళ్లొచ్చని సూచించినట్లు తెలుస్తోంది.