పెట్రోల్, డీజిల్ అలా నింపుకోవటం చట్ట విరుద్ధం.. కఠిన చర్యలు తీసుకుంటాం: మంత్రి ఉత్తమ్

4 weeks ago 3
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే వార్తలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో మూడు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని, డిమాండ్ పెరిగినా సరఫరా ఆటంకం లేకుండా సాగుతుందని తెలిపారు. కేవలం ట్రాన్స్‌పోర్టు ఇబ్బందుల వల్లే కొన్నిచోట్ల 'నో స్టాక్' బోర్డులు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇంధనాన్ని క్యాన్లలో నిల్వ చేయడం చట్టవిరుద్ధమని అలా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిస్తూ.. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.
Read Entire Article