కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలో విషాద ఘటన జరిగింది. అప్పుల బాధతో ఓ వ్యాపారి కొడుకును చంపి తాను ఆత్మహత్య చేసుకున్నారు. వేమిరెడ్డి సాయిప్రకాష్‌రెడ్డి అనే బంగారు ఆభరణాల వ్యాపారి ఆర్ధిక ఇబ్బందులతో ఈ దారుణానికి ఒడిగట్టారు.. ఏప్రిల్ 9న కొడుకు తక్షిత్‌కు సైనైడ్ కలిపిన ఐస్‌క్రీమ్ తినిపించి, తాను తిన్నారు. తండ్రీ కొడుకు ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.