బీటెక్ చదువుతున్న అమ్మాయికి.. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న అబ్బాయికి ఘనంగా వివాహం చేశారు. పెళ్లి తర్వాత నగరంలో కొత్త జంట కొత్త కాపురం పెట్టగా.. కూతురికి పనులు అలవాటయ్యేవరకు తల్లే కొన్ని రోజుల పాటు ఉంది. కొత్త జంటతో ఎక్కువ రోజులు ఉన్నా అంత బాగోదనుకుని తల్లి సొంతూరు వెళ్లిపోయింది. తల్లి వెళ్లిపోయిన నాలుగో రోజే.. ఆ నవవధువు ఊహించని పని చేసింది. భర్త డ్యూటీకి వెళ్లటం చూసి.. ఇంట్లో ఉరేసుకుని బలవతంగా ప్రాణాలు తీసుకుంది.