ఏడేళ్ల నిరీక్షణ తర్వాత తన కల నిజమవుతుందన్న ఆ తల్లి ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. కవల పిల్లలను కనబోతున్నానన్న ఆమె సంతోషం ఐదు నెలలకే ఆవిరైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐదు నెలలకే పుట్టిన కవలలు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే పిల్లలు చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.