తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వం నుంచి రూ.1400 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉండటంతో ప్రైవేటు ఆసుపత్రులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఘం ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో సేవలు నిలిపివేశారు. దీంతో గుండె, కిడ్నీ సమస్యలున్న రోగులకు వైద్యం అందడం లేదు. త్వరగా సమస్య పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.