పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోన్న సర్కార్.. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు అన్ని డబుల్ బెడ్ రూం ప్రాజెక్టులను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలోకి బదిలీ చేసింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు తాజాగా జారీ అయ్యాయి.