తెలంగాణలో గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళన కలిగిస్తోంది. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా అవుతున్న గంజాయిని చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలో విక్రయిస్తున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరులో పీచుమిఠాయి విక్రేత వద్ద గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్కూల్ పిల్లలే లక్ష్యంగా అతడు గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇక ఇటీవల గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో డెకాయ్ ఆపరేషన్‌లో 14 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.