ఆంధ్రప్రదేశ్లో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు గురువారం జరుగుతున్నాయి. అయితే రాజమండ్రి 62వ వార్డు మల్లయ్యపేట పోలింగ్ బూత్ దగ్గర బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహంతో ఊగిపోయారు. వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. దీంతో వారికి తొడ కొట్టి మరీ సవాల్ విసిరారు. ఈ క్రమంలో స్థానిక వైసీపీ నేత, సోము వీర్రాజు మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది.