హైదరాబాద్‌లోని బాలానగర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వాహనదారుడు ఆర్టీసీ బస్సు కింద పడి మృతి చెందాడు. చలానా రాసేందుకు రన్నింగ్‌లో ఉన్న ద్విచక్రవాహనాన్ని ఆపేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో.. పోలీసులను తప్పించుకునేందుకు ద్విచక్ర వాహనదారుడు ప్రయత్నించగా.. అదుపుతప్పి కింద పడ్డాడు. అదే సమయంలో అటు నుంచి ఆర్టీసీ బస్సు వస్తుండగా.. బస్సు టైర్ అతని తలపై నుంచి వెళ్లింది. దీంతో ఆ వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు.