ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. 13 ఏళ్లుగా ఓ మహిళ మిస్సింగ్ కేసులో సరైన దర్యాప్తు చేయలేదని వారిపై మండిపడింది. ఈ కేసును స్వతంత్ర సంస్థకు అప్పగిస్తే మంచిదని కోర్టు అభిప్రాయపడింది. అలానే అఫిడవిట్ దాఖలు చేయాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. 2012లో మంగాదేవి అనే మహిళ అదృశ్యమైంది. 13 ఏళ్లు అయినా.. ఈ కేసులో ఎలాంటి మార్పు కనిపించలేదు.