రాజేశ్ లాకప్ డెత్ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ పోలీసులపై సీరియస్ అయింది. కేసుకు సంబంధించిన పూర్తి నివేదికను మూడు వారాల్లో సమర్పించాలని సూర్యాపేట జిల్లా అధికారులు, పోలీసులను ఆదేశించింది. పోస్ట్‌మార్టం నివేదిక, వీడియో, మేజిస్ట్రియల్ విచారణ వివరాలు, వైద్య రికార్డులు సహా అన్ని ఆధారాలను అందించాలని సూచించింది. బాధిత కుటుంబం దీనిని కస్టడీ హత్యగా పేర్కొంటుండగా, ఎన్‌హెచ్‌ఆర్సీ జోక్యంతో కేసు దర్యాప్తు మరింత కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది.