తెలంగాణలో గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు తీవ్ర వేడిమి కారణంగా ఇబ్బంది పడుతున్నారు. వాతావరణ శాఖ ప్రకారం.. రాబోయే రెండునెలలు మరింత వేడి పెరిగే అవకాశం ఉంది. శుక్ర, శని, ఆదివారాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు పెరిగే అంచనా ఉంది. తగిన జాగ్రత్తలు పాటించకుంటే హీట్‌స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.