Pawan Kalyan On Chanting Om Namo Narayanaya Mantra: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చారు. జరిగిన అపవిత్రానికి ప్రాయశ్చిత్తంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని క్షమాపణ వేడుకోవాలన్నారు. ఈ మేరకు ఒక మంత్రాన్ని జపించాలని పిలుపునిచ్చారు.