అసలే వర్షా కాలం నడుస్తోంది. భారీ వర్షాల కారణంగా వైరల్ ఫీవర్లు జోరుగా వ్యాపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో జనాలు బయట తిండి తినాలంటేనే జంకుతారు. అలాంటిది.. ఈ వీడియోలు చూస్తే.. ఇక హోటళ్లు అంటేనే వాంతి చేసుకునే పరిస్థితి. మొన్నటి వరకు ప్రముఖ హోటళ్ల కిచెన్‌లలో గలీజు వాతావరణం ఉందంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులు తేల్చగా.. ఇప్పుడు ఓ హోటల్‌లో ఏకంగా డ్రైనేజీ నీళ్లతోనే ప్లేట్లు, గ్లాసులు కడుగుతూ.. వాటిలోనే ఫుడ్ సర్వ్ చేస్తున్న నిర్వాకం బయటికి వచ్చింది.