బస్సులో ఎక్కిన ఓ ప్రయాణికురాలి పట్ల కండక్టర్ అమార్యదగా, దురుసుగా ప్రవర్తించాడు. మార్గమధ్యలోనే ఆమెను బస్సు నుంచి కిందకు దించేశాడు. ఏడాది వయస్సున్న చిన్నారి, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి ఉందని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఆమె భర్త ఆర్టీసీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా.. కండక్టర్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన జనగామ డిపో పరిధిలో చోటు చేసుకుంది.