దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్ల షెడ్యూల్‌లలో మార్పులు చేసింది. అక్టోబర్ 21 నుంచి కొంకణ్ రైల్వే నాన్-మాన్సూన్ టైమ్‌టేబుల్ అమలులోకి రానుంది. డిసెంబర్ 3 నుంచి ఎర్నాకులం–బెంగళూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను సాధారణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చనున్నారు. డిసెంబర్ 4 నుంచి కాచిగూడ–యశ్వంత్‌పూర్ వందే భారత్ రైలు శుక్రవారాల్లో నడవదు. ఉదయం 5.45కు కాచిగూడ నుంచి బయలుదేరి.. రాత్రి 12 గంటలకు తిరిగి చేరుతుంది. డిసెంబర్ 5 నుంచి సికింద్రాబాద్–విశాఖపట్నం వందే భారత్ రైలు సోమవారాల్లో రద్దు కానుంది. ప్రయాణికుల డిమాండ్ ఆధారంగా ఈ మార్పులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.