గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలు, మూసీ నది ఉద్ధృతి కారణంగా మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నీట మునిగింది. దీంతో శనివారంఇక్కడి నుంచి వెళ్లాల్సిన బస్సు సర్వీసులను తాత్కాలికంగా ఆపివేసి.. ఆరాంఘర్, ఎల్బీనగర్, జేబీఎస్ వంటి ప్రత్యామ్నాయ ప్రాంతాల నుంచి నడిపారు. ప్రస్తుతం వరద పూర్తిగా తగ్గడంతో ఆర్టీసీ సిబ్బంది బస్ స్టేషన్‌లో పేరుకుపోయిన బురదను తొలగించారు. శుభ్రతా పనుల అనంతరం బస్సు సేవలు మళ్లీ ఎంజీబీఎస్ నుంచే ప్రారంభమయ్యాయి.