దక్షిణ మధ్య రైల్వే అమృత్ భారత్ కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ పనులు చేపడుతోంది. చర్లపల్లి-మౌలాలి-బొల్లారం మార్గంలో కొత్తగా నిర్మించిన ఆర్కేనగర్, దయానంద్ రైల్వే స్టేషన్లు త్వరలో ప్రజలకు అందుబాటులోకి వస్తాయని జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఈ స్టేషన్లలో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరికొన్ని రైళ్లు ఆగుతాయని ఆయన చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే ఈ కొత్త స్టేషన్లను ప్రారంభించడం వల్ల హైదరాబాద్ నగరంలో రైల్వే నెట్‌వర్క్ మరింత విస్తరించనుంది.