పారాక్వాట్ డైక్లోరైడ్ అనే గడ్డి మందుపై నిషేధం విధించాలని.. ఎంపీ కడియం కావ్య లోక్‌సభలో డిమాండ్ చేశారు. ఈ గడ్డి మందు కారణంగా పర్యావరణం దెబ్బ తినడమే కాకుండా.. మనుషులపైనా దుష్ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గడ్డి మందు భూసారాన్ని తగ్గించడమే కాకుండా.. భూగర్భ జలాలు కూడా విషంగా మారుతున్నాయని తెలిపారు. గ్రామాల్లో రైతుల ఆత్మహత్యలకు ఈ గడ్డి మందు సాధనంగా మారుతోందని కడియం కావ్య పేర్కొన్నారు.