ఈ ఏడాది జనవరిలో ప్రియుడి కోసం తల్లిదండ్రులకు మత్తుమందు ఇచ్చి హత్య చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆ కేసులో అరెస్టయ్యి జైలుకు వెళ్లిన నర్సు సురేఖ.. ఇటీవల బెయిల్‌పై విడుదల అయింది. కుటుంబ సభ్యులు, బంధువులకు దూరమైన ఆ యువతి సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ తీవ్ర మనస్తాపంతో తన తల్లిదండ్రులకు ఇచ్చిన మత్తుమందుతోనే బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు రాకపోవడంతో సంగారెడ్డి పోలీసులు వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.