ప్రియుడి మోజులో భర్త దారుణ హత్య.. పక్కా స్కెచ్ వేసి మరీ..!

2 weeks ago 7
ప్రియుడిపై మోజుతో భార్య తన భర్తను కిరాతకంగా హత్య చేయించిన ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్‌ పురపాలిక పరిధిలోని శనిగపురం శివారు బోరింగ్‌ తండా సమీపంలో సోమవారం జరిగిన ఈ ఘాతుకాన్ని భార్యే ఒడిగట్టిందని తెలియడంతో అందరూ నివ్వెరపోయారు. అతి తక్కువ సమయంలోనే ఈ మిస్టరీని పోలీసులు ఛేదించారు. మృతుడి భార్య తాటి స్వప్నతో పాటు ఆమె ప్రియుడు విద్యాసాగర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. జిల్లా ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ గురువారం పట్టణ పోలీసు స్టేషన్‌లో ఈ వివరాలను వెల్లడించారు.
Read Entire Article