ప్రియురాలి కోసం ఓ ప్రియుడు తాను పని చేస్తున్న సొంత కంపెనీకే కన్నం పెట్టాడు. 8 ఏళ్లుగా పని చేస్తూ.. తనపై యజమాని పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడు. తన ప్రేయసితో విహారయాత్రలకు వెళ్లటానికి.. ఏకంగా 28 తులాల బంగారాన్ని పక్కదారి పట్టించాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బషీర్ బాగ్‌లో జరిగింది. ఎంత బంగారాన్ని అమ్ముకున్నా అనుమానం రాలేదు కానీ.. రెండు నెలలుగా డ్యూటీకి వెళ్లకపోవటంతో.. యజమానికి అనుమానం వచ్చింది.