శ్రీశైలంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే.. ఓ వ్యక్తి తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హైదరాబాద్ తీసుకొచ్చాడు. కానీ.. ఇద్దరి మధ్య జరిగిన గొడవలతో.. ఆ అమ్మాయి.. తన భర్తతో దూరంగా ఉంటోంది. తన భార్య దూరంగా ఉండటాన్ని భరించలేకపోయిన ఆ భర్త.. కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య ఉంటున్న హాస్టల్ పక్కనే ఓ చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు వదిలేశాడు. ఈ విషాదకరమైన ఘటన హైదరాబాద్‌లో మియాపూర్‍లో జరిగింది.