వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపిన వివాహిత పద్మజ మృతి కేసులో సస్పెన్స్ వీడింది. పద్మజ మృతి కేసులో మిస్టరీని ఛేదించిన పోలీసులు.. ఆమె భర్తే హత్య చేసినట్లు గుర్తించారు. పద్మజ భర్త కిరణ్ కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ వివరాలను ప్రొద్దుటూరు పోలీసులు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. లావుగా ఉండటంతో పాటుగా, నిత్యం అనుమానిస్తోందనే కోపంతో పాలకోవాలో విషం కలిపి.. ఆపై దిండుతో అదిమి కిరణ్ కుమార్ తన భార్యను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.