Kadapa Graveyard: కడప జిల్లా ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు శ్మశానం దగ్గర ఓ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రొద్దుటూరు నుంచి ఆర్టీపీకి వెళ్లే దారిలో ఉన్న శ్మశానం దగ్గర కొంతమంది వ్యక్తులు అనుమానంగా కనిపించారు. గుప్త నిధులుపై కొంతమందికి ఉన్న ఆశను ఆసరాగా చేసుకుని వారి వద్ద నుంచి లక్షలకు లక్షలు కాజేసి వారిని మోసం చేయాలనే ఆలోచనతో ముందుగానే ఒక విగ్రహాన్ని, కొన్ని జాతి రాళ్ళను కొని వాటిని పూడ్చిపెట్టి మోసం చేస్తున్నారు.