తెలంగాణ బియ్యానికి దేశంలోనే కాక విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఈక్రమంలో విదేశాలు తెలంగా నుంచి బియ్యాన్ని ఎగుమతి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా రాష్ట్రం నుంచి ఫిలిప్పీన్స్‌కు 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేయడానికి ఒప్పందం కుదిరింది. ఇప్పటికే తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు 30 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేస్తున్నారు. ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ సోనా రకానికి అక్కడ మంచి డిమాండ్ ఉంది. భవిష్యత్తులో మొక్కజొన్నను కూడా ఎగుమతి చేసే అవకాశం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.