ఫైర్ సిబ్బంది సమయానికి రాలేదు.. వారి దగ్గర సరైన పరికరాలు లేవు: కిషన్ రెడ్డి

9 months ago 16
హైదరాబాద్‌లోని పాతబస్తీలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోయారు. ఆదివారం తెల్లవారుజామున చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో ఈ ప్రమాదం సంభవించింది. దీనిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సంఘటనపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బాధితులను ఆదుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సంలచన వ్యాఖ్యలు చేశఆరు. అగ్నిమాపక సిబ్బంద వెంటనే స్పందించలేదని.. సహాయక చర్యలు ప్రారంభించలేదని.. వారి దగ్గర సరైన పరికరాలు లేవని బాధితులు తెలిపారని ఆరోపించారు. దీని వల్ల సహాయక చర్యలు ఆలస్యం అయ్యాయిని చెప్పుకొచ్చారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. వీటిని నివారించడం కోసం సంబంధిత శాఖలు ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఇది రాజకీయపరమైన అంశం కాదు. ఎవరి మీద విమర్శలు చేయకూడదు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అలానే అగ్నిమాపక సిబ్బంది, ఇతర శాఖల వారు అప్పమత్తంగా ఉండాలి అని తెలిపారు. వారికి అధునాతన పరికరాలు అందించాలి. సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇవ్వాలని సూచించారు.
Read Entire Article