హైదరాబాద్‌లో ఎవరైనా తాగునీటిని వృథా చేస్తున్నారా. అయితే అది మీ కంట పడిందా.. మీకు ఒక గుడ్‌న్యూస్. ఎందుకంటే తాగు నీరు వేస్ట్ చేసే వారి పట్ల జీహెచ్ఎంసీ అధికారులు కొరఢా ఝళిపించనున్నారు. నీటిని వృథా చేసే వారికి సంబంధించిన ఫోటోలను క్లిక్ మనిపించి.. ఆ ఫోటోలను యాప్‌లో అప్‌లోడ్ చేస్తే.. వారికి రూ.200 బహుమతి ఇవ్వనున్నారు. వచ్చేది వేసవి కావడంతో నీటి కొరత లేకుండా ఉండేందుకు అధికారులు ముందు జాగ్రత్తలు చేపడుతున్నారు.