ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్‌లను భారత్‌కు రప్పించేందుకు లైన్ క్లియర్ అయింది. వారిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. రెడ్ కార్నర్ నోటీస్‌పై ఇంటర్ పోల్ ద్వారా సీబీఐ నుంచి తెలంగాణ సీఐడీకి సమాచారం వచ్చింది. వీలైనంత త్వరగా వారిని భారత్‌కు రప్పించేందుకు కేంద్ర హోం శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు విదేశీ వ్యవహారాల శాఖతో సంప్రదింపులు చేస్తున్నారు. రెడ్ కార్నర్ నోటీసు సమాచారం డీహెచ్ఎస్‌కు అందగానే అమెరికాలో ప్రొవిజనల్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది.