కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఏప్రిల్ 27న వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కార్యకర్తలు హాజరుకాకుండా కాంగ్రెస్ నేతలు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆమె ఆరోపించారు. బెదిరింపులకు పాల్పడేవారి పేర్లను పింక్ బుక్‌లో రాసుకుంటామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కవిత హెచ్చరించారు. కాంగ్రెస్ మోసపూరిత పార్టీ అని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.