ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియూ కలిశారు. త్వరలోనే తాను హైదరాబాద్ నగరాన్ని సందర్శిస్తారని చెప్పారు. పరిశ్రమలు, సేవా రంగాలను విస్తరించే సత్తా హైదరాబాద్‌కు ఉందని అన్నారు. ఫ్యూచర్ ఫోర్త్ సిటీ ఏర్పాటులో సీఎం విజన్ అద్భుతమని కొనియాడారు.