బంగారం అమ్మాలనుకునే వారి కోసం హైదరాబాద్‌కు చెందిన గోల్డ్‌సిక్కా సంస్థ ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెల్లిజెన్స్) ఆధారిత ‘గోల్డ్ మెల్టింగ్ ఏటీఎం’ను తీసుకురానుంది. ఈ యంత్రం బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసి.. ప్రస్తుత ధర ప్రకారం విలువను తెలియజేస్తుంది. వినియోగదారులు నగదు లేదా కొత్త బంగారం పొందవచ్చు. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సరైన విలువ లభిస్తుంది. ఈ కొత్త విధానం ద్వారా బంగారాన్ని విక్రయించే వారికి సమయం, డబ్బు ఆదా అవుతుంది.