ఆంధ్రప్రదేశ్ వాసులకు ముఖ్య గమనిక. బంగాళాఖాతంలో మరికొన్ని గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో రెండు రోజులు అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా అంచనా వేసింది.