తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా.. ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే.. పార్టీ మారిన గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిస్థితి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. కృష్ణ మోహన్ రెడ్డికి ప్రాణ హాని ఉందంటూ కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.