బనగానపల్లె: ఇంటికి పారిపోతాడని.. విద్యార్థి కాలికి ఇనుప సంకెళ్లు..

1 week ago 3
నంద్యాల జిల్లా బనగానపల్లెలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఇంటికి పారిపోతాడనే కారణంతో ఓ విద్యార్థి కాళ్లకు ఇనుప సంకెళ్లు వేసిన ఘటన బనగానపల్లెలోని ఓ మదరసాలో చోటుచేసుకుంది. ఇంటికి వెళ్లిపోతాడనే నెపంతో ఓ విద్యార్థి కాలిని.. చెక్క మొద్దుకు గొలుసులతో బంధించి తాళం వేసి నిర్బంధించారు. అయితే ఆ విద్యార్థి ఇనుప సంకెళ్లతోనే రోడ్డుపైకి వచ్చేశాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.. మైనర్ బాలుడి కాళ్లకు ఇలా సంకెళ్లు వేసి బంధించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుణ్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం విద్యార్థిని ఇలా గొలుసులతో బంధించిన మదరసా ఉపాధ్యాయుడిని పోలీసులు పిలిపించి మందలించారు.
Read Entire Article