KTR: మహిళలకు ఉచిత బస్సు పథకంపై తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు. తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరై క్షమాపణలు చెప్పారు. అంతకుముందు అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ మహిళా నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు.. మహిళా కమిషన్ సభ్యులు కేటీఆర్‌కు రాఖీలు కట్టి తమ అభిమానం చాటుకున్నారు.