హైదరాబాద్‌లోని పలు సెలూన్లు, స్పా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే సెలూన్లు, స్పా సెంటర్ల ముసుగులో చీకటి యవ్వారం నడిపిస్తున్న భాగోతాలు బయటపడ్డాయి. కేపీహెచ్‌బీ కాలనీ పరిధిలోని ఓ సెలూన్‌తో పాటు చందానగర్ ప్రాంతంలోని ఓ స్పా సెంటర్‌లో పోలీసులు దాడులు నిర్వహించగా.. వ్యభిచారం చేస్తున్నట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే.. వాటి నిర్వాహకులతో పాటు పలువురు మహిళలు, విటులను కూడా అరెస్ట్ చేశారు.