బర్డ్ ఫ్లూ భయం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

3 hours ago 2
ఏపీలోని పలు జిల్లాల్లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకి భారీ సంఖ్యలో చనిపోవడంతో తెలంగాణలో అధికారులు అప్రమత్తం అయ్యారు. తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్‍పోస్ట్ లు ఏర్పాటు చేసి ఏపీ నుంచి కోళ్ల వాహనాలు రాకుండా అడ్డుకుంటున్నారు. అన్ని జిల్లా సరిహద్దుల్లో చెక్‍పోస్టులు ఏర్పాటు చేసిన అధికారులు ఏపీ నుంచి తెలంగాణకు కోళ్ల లోడుతో వస్తున్న వాహనాలను వెనక్కి తిప్పి పంపుతున్నారు. కోళ్లకు సోకుతున్న బర్డ్ ఫ్లూ సమస్యపై పౌల్ట్రీ రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను మంత్రులు ఆదేశిస్తున్నారు.
Read Entire Article