తెలంగాణ ఆర్టీసీ బస్సులో మహిళా కండక్టర్ గొప్ప మనసును చాటుకుంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ నిండు గర్భిణీకి పురుడు పోసి తల్లీ, బిడ్డలను కాపాడింది. సోదరుడికి రాఖీ కట్టేందుకు బస్సులో బయల్దేరిన గర్బిణీకి పురుటినొప్పులు రాగా.. సమయస్పూర్తితో స్పందించి ప్రసవం చేసింది. దీంతో మహిళా కండెక్టర్‌పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.