టీజీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తోన్న ఓ గర్భిణీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన.. సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయి వద్ద జరిగింది. కోదాడ డిపోకు చెందిన బస్సులో ప్రయాణిస్తోన్న ఓ గర్భిణికి.. తాడ్వాయి దగ్గరకు రాగానే పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. గమనించి కండక్టర్ బస్సును వెంటనే ఆపించి.. బస్సులో మహిళా ప్రయాణికులతో ఆమెకు పురుడు పోయించారు. అనంతరం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని తెలిపారు.