Bapatla Security Guard Doctorate: బాపట్ల జిల్లాకు చెందిన ఏడుకొండలు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు.. ఆయనకు తమిళనాడులోని ఇంటర్‌నేషనల్ కల్చర్ రీసెర్చి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆయన సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూనే.. నాటక రంగంలో కూడా రాణిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ను అందజేసింది. ఏడుకొండలు వీరబ్రహ్మేంద్రస్వామి నాటకంలో సిద్ధయ్య పాత్ర లో ఏకంగా 150 ప్రదర్శనలు చేశారు. అలాగే సత్యహరిశ్చంద్ర నాటకంలో పాత్రలతో కూడా ఆకట్టుకున్నారు.