KTR on Revanth Reddy: హైదరాబాద్‌లో గాంధీ ఆస్పత్రిలో శిశువులు, బాలింతల మరణాల సంఖ్యపై రాష్ట్రంలో సర్వత్రా చర్చ నడుస్తోంది. అసలైన మరణాల సంఖ్యను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాచిపెడుతోందంటూ ప్రతిపక్ష ఆరోపిస్తుంటే.. ఎప్పుడూ జరిగేదే అంటూ ప్రభుత్వం కొట్టిపారేస్తుండటం గమనార్హం. అయితే.. ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో ప్రభుత్వంపై సెటైరికల్ ట్వీట్ చేశారు. మరోవైపు.. మంత్రి దామోదర రాజనర్సింహ చేసిన ట్వీ్ట్‌కు కౌంటర్ ఇచ్చారు.