హైదరాబాద్‌లో కొంతమంది నకిలీ డాక్యుమెంట్లతో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి యత్నించారు. రెవెన్యూ అధికారులు దీనిని గుర్తించారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ సర్వే ఆధారంగా భూమిని ప్రభుత్వ స్థలంగా ప్రకటించారు.. బాధ్యులపై కేసులు నమోదు చేశారు. 2001లో నిర్వహించిన అర్బన్ ల్యాండ్ సీలింగ్ సర్వే మ్యాప్‌ను ఆధారంగా తీసుకుని ప్రస్తుత నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు రెవెన్యూ అధికారులు. సదరు భూమి యూఎల్‌సీ భూమి అని నిర్ధారించి.. ఆ స్థలంపై బోర్డు ఏర్పాటు చేశారు.