Nandamuri Balakrishna Helps For Girls Medical Treatment: తూర్పుగోదావరి జిల్లాకడియపు లంకకు చెందిన రాజ్‌కుమార్ కుమార్తె అస్వస్థతకు గురైంది. అయితే ఈ విషయం జనసేన పార్టీ నేతకు తెలియగా.. ఆయన ఏపీ మంత్రి కందుల దుర్గేష్‌కు వివరించి సాయం కోరారు. మంత్రి వెంటనే బాలయ్యతో మాట్లాడగా.. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో వైద్యం అందించేందుకు ముందుకు వచ్చారు. చిన్నారికి కావాల్సిన వైద్య సాయం అందించాలని బాలయ్య స్వయంగా వెళ్లి సిబ్బందికి సూచించారు.. ఆ చిన్నారిని, తండ్రిని కూడా కలిశారు.