New Rules in Hyderabad: హైదరాబాద్ వాసుల కోసం సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నగరంలో.. ఒంటి గంట వరకు అన్ని దుకాణాలు హోటళ్లు, రెస్టారెంట్లు ఓపెన్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇచ్చారు. మద్యం దుకాణాలు తప్ప.. నగరంలో ఏ దుకాణాలైన తెరుచుకోవచ్చని.. వ్యాపారాలు చేసుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా.. నగరంలో 11 గంటల వరకే పోలీసులు వచ్చి దుకాణాలు మూసేయిస్తున్నారని పలువులు సభ్యులు సీఎం దృష్టికి తీసుకురాగా ఈ మేరకు ప్రకటన చేశారు.