తెలంగాణలో ఆధార్-ఈ సంతకం విధానాన్ని ఆర్ముర్, కూసుమంచి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ విధానం రేపటి నుంచి అమల్లోకి రానున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. రాష్ట్రంలోని మొత్తం 144 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ప్రక్రియపై సమీక్షించారు. డబుల్ రిజిస్ట్రేషన్లు అరికట్టేందుకు డెవలపర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ రానున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.