న్యూఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే.. న్యూఇయర్ వేడుకలకు హైదరాబాద్ పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. న్యూఇయర్ వేడుకల్లో భాగంగా నిర్వహించే ఏ ఈవెంట్స్‌లో అయినా.. సీసీ కెమెరాలు తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు.. వేడుకల్లో అశ్లీల నృత్యాలు నిషేధమని.. ఔట్‌డోర్‌లో రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు కూడా బ్యా్న్ అంటూ వెల్లడించారు. ఇక.. తాగి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానాతో పాటు 6 నెలలు జైలు శిక్ష విధించనున్నట్టు పోలీసులు హెచ్చరించారు.