బిగ్ షాక్.. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్‌కు బ్రేక్.. హైకోర్టు కీలక ఆదేశాలు..

1 year ago 46
హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులకు హైకోర్టు బ్రేక్ వేసింది. పాతబస్తీలో వారసత్వ కట్టడాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉండటంతో, వాటి పరిరక్షణపై అధ్యయనం చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పనులు చేపట్టవద్దని స్పష్టం చేసింది. చార్మినార్, ఫలక్ నుమా ప్యాలెస్ వంటి కట్టడాలకు నష్టం వాటిల్లకుండా చూడాలని పిటిషనర్ కోరారు. ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణ మూడు వారాలకు వాయిదా పడింది.
Read Entire Article